న్యూఢిల్లీ: లంచాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై గెయిల్ మార్కెటింగ్ వ్యవహారాల డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. నోయిడాలోని ఆయన నివాసంలో నిర్వహించిన సోదాలలో రూ.1.3 కోట్ల నగదుతో పాటు, విలువైన ఆభరణాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో రంగనాథన్, నాయర్‌లతోపాటు పవన్ గౌర్, రాజేష్ కుమార్, యునైటెడ్ పాలిమర్ ఇండస్ట్రీస్‌కు చెందిన సౌరభ్ గుప్తా, బన్సల్ ఏజెన్సీస్‌కి చెందిన ఆదిత్య బన్సాల్ ఉన్నారు. వీరందరిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm