హైదరాబాద్ : తెలంగాణలో కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు వర్సిటీల్లో ఈనెల 30 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈనెల 30 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసింది. సెలవుల పొడిగింపు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. కరీంనగర్లోని శాతవాహన వర్సిటీలో ఐదో సెమిస్టర్ పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈనెల 30 వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Jan,2022 03:32PM