అబుదాబి : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలోని అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడులు చోటుచేసుకున్నాయి. యెమన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు సంస్థ ఈ దాడులు చేసింది. ప్రధాన విమానాశ్రయంలో ఒక పేలుడు జరగ్గా.. మరో చోట మూడు చమురు ట్యాంకులు పేలిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు డ్రోన్ దాడులే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. విమానాశ్రయం వద్ద జరిగిన పేలుడు చిన్నదేనని పోలీసులు చెప్పారు. దాడుల వల్ల పెద్దగా నష్టం జరగలేదని చెప్పారు.