హైదరాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల వరంగల్ జిల్లాలో పంట నష్టం వాటిల్లింది. దాంతో సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది.
ప్రగతిభవన్ లో జరుగుతున్న కేబినెట్ భేటీ కొనసాగుతోంది. అందులో భాగంగా ధాన్యం కొనుగోళ్ల పై చర్చ జరిగింది. ధాన్యం కొనుగోలు తుదిదశకు చేరిందని మంత్రిమండలికి అధికారులు వెల్లడించారు. వర్షాలతో కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లు ఆలస్యమైందని తెలిపారు. ధాన్యం పూర్తిగా కొనే వరకు కేంద్రాల కొనసాగించాలని కేబినెట్ ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Jan,2022 05:14PM