హైదరాబాద్ : ప్రస్తుతం ఓటీటీలకు మంచి డిమాండ్ ఉంది. దాంతో చాలా సినిమాలు ఇప్పుడు ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తెలుగు వారి కోసం అల్లు అరవింద్ 'ఆహా' తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో తెలుగు ఓటీటీ వచ్చేసింది. సన్ షైన్ పేరుతో వచ్చిన ఈ ఓటిటి యాప్ లాంచింగ్ వేడుక హైదరాబాద్‌లోని దస్ పల్లా హోటల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రభాకర్,యువ హీరో రాం కార్తీక్‌లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఓటిటి వ్యవస్థాపకుడు శివప్రసాద్ మాట్లాడుతూ..సన్ షైన్ ఓటిటి ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉందన్నారు. ఈ ఓటిటి లో సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, గేమ్స్, స్పోర్ట్స్,లైవ్ న్యూస్, కిడ్స్ కంటెంట్, ఈవెంట్స్, లైవ్ ఈవెంట్స్ ఇలా అన్ని రకాల కంటెంట్‌తో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని సేవలు అందించడం జరుగుతుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 17 Jan,2022 06:40PM