- సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో అధికారుల అలసత్వం
నవతెలంగాణ-బెజ్జంకి
ఈ నెల 22న రాష్ట్ర మంత్రి తన్నీరు హారీష్ రావు మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న దృష్ట్యా సోమవారం మండల కేంద్రంలోని డబుల్ ఇండ్లు,వారసంత,బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలోని సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీడీఓ దమ్మని రాము పరిశీలించారు.సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో సంబధిత అధికారుల పర్యవేక్షణ చేయకుండా ఎంపీడీఓ దమ్మని రాము పర్యవేక్షించడం గమనార్హం.సర్పంచ్ టేకు తిరుపతి,పంచాయతీ కార్యదర్శి మంద రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm