ముంబై: హాస్టల్ భవనం ఏడో అంతస్తు పైనుంచి ఓ పీజి విద్యార్థి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ముంబైలోని పోవైలో ఉన్న ఐఐటి హాస్టల్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శన్ మాలవీయ(26) ఐఐటీలో చదువుతున్నాడు.. సోమవారం హాస్టల్ ఏడో అంతస్తు భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డిప్రెషన్ కారణంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు
Mon Jan 19, 2015 06:51 pm