Near-Earth #asteroid 1994 PC1 (~1 km wide) is very well known and has been studied for decades by our #PlanetaryDefense experts. Rest assured, 1994 PC1 will safely fly past our planet 1.2 million miles away next Tues., Jan. 18.
— NASA Asteroid Watch (@AsteroidWatch) January 12, 2022
Track it yourself here: https://t.co/JMAPWiirZh pic.twitter.com/35pgUb1anq
హైదరాబాద్ : ఓ అతి పెద్ద గ్రహాశకలం భూమి వైపు దూసుకువస్తోన్నట్టు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. ఈ గ్రహశకలానికి (7482) 1994 పీసీ1గా నామకరణం చేశారు. నాసా తెలిపిన వివరాల ప్రకారం.. దీనిని మొదట ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో పనిచేస్తున్న ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ మెక్ నాట్ 1994 ఆగస్టు 9న కనుగొన్నారు. ఈ పెద్ద గ్రహశకలం జనవరి 18, 2022 న (రేపు) భూమి నుంచి అత్యంత సమీపంగా వెళ్లనుంది. నాసా 1994 పీసీ1 గ్రహశకలాన్ని ప్రమాదకరమైన గ్రహశకలంగా వర్గీకరించింది. భూమి నుంచి 1.2 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనున్నట్టు నాసా తెలిపింది. ఈ గ్రహశకలం గంటకు 43,754 మైళ్లు (సెకనుకు 19.56 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తోంది.
ఈ గ్రహశకలం వల్ల భూ కక్ష్యలో పెను మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పెద్ద గ్రహశకలాన్ని టెలిస్కోప్ ద్వారా వీక్షించవచ్చు. అలాగే, నాసా దీనిని ట్రాక్ చేయడానికి ఒక లింకు కూడా ట్విటర్ వేదికగా షేర్ చేసింది.