అమరావతి : మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో మద్యం దుకాణాల పనివేళలను మరో గంట పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాలు ఇకపై రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచుతారు. అయితే కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm