అమరావతి : చెరువులోకి కారు దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలం ఎర్రబాలెం వద్ద చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి మండలం కృష్ణా యపాలెం నుంచి వస్తున్న AP16CE 5328 నెంబర్ గల కారు సోమవారం రాత్రి ఎర్రబాలెం గ్రామ శివారులోని చెరువులోకి దూసుకెళ్లింది.దాంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే వారు మృతి చెందారు. మృతి చెందిన నలుగురిలో సాయి, తేజ అనే ఇద్దరు యువకులు మంగళగిరి ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మిగిలిన ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm