హైదరాబాద్: నగరంలోని ఆర్గనైజింగ్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ముఠాను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు నిందితులు రామకృష్ణ, సురేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాస్ క్రికెట్ మ్యాచ్ కోసం ఇద్దరు నిందితులు అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి రూ.1.10లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను చిలకలగూడ పోలీసులకు అప్పగించారు.
Mon Jan 19, 2015 06:51 pm