లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికలు వేళ సమాజ్‌వాదీ పార్టీ ప్రచారంలో జోరు పెంచింది. అధికార పార్టీని ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ఎస్పీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా రైతాంగాన్ని ఆకర్షించుకొనేందుకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ హామీల వర్షం కురిపించారు. దానిలో పాటు ప్రతి పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఇవ్వడంతో పాటు ఉచిత నీటిపారుదల వసతులు సమకూరుస్తామనీ, చెరకు పండించే రైతులకు 15 రోజుల్లోనే బకాయిలు చెల్లించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, బీమా, పింఛను సదుపాయాలు కల్పించనున్నట్టు హామీలిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు మడిమ తిప్పకుండా పోరాటం చేసిన కేంద్రం మెడలు వంచే పోరాడిన రైతులపై కూడా అఖిలేశ్ వరాలు కురిపించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమించిన రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామన్నారు. అలాగే, ఉద్యమంలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించారు. ఈ హామీలన్నింటినీ తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తున్నట్టు అఖిలేష్ యాదవ్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2022 10:52AM