హైదరాబాద్: తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన కుమారుడు, సినీ నటులు బాలకృష్ణ అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల, పీడిత ప్రజలకు పదవులు ఇచ్చారనే విషయాన్ని మర్చిపోకూడదని తెలిపారు. తెలంగాణలో 610జీవో తీసుకొచ్చింది ఎన్టీఆరే అని గుర్తుచేశారు. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని 610జీవో అమలు చేశారు. స్థానికతపై ఇప్పుడు మళ్లీ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు నిరసన తెలుపుతున్నారని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm