హైదరాబాద్ : కేరళలో ఓ ఎనుగు రోడ్ల మీద పరుగులు పెట్టడంతో కలకలం రేగింది. కేరళలో పాలక్కడ్ జిల్లాలో మాథుర్ స్ట్రీట్‌లో ఓ మసీదు వద్ద ఊరేగింపునకు ఏనుగును తీసుకెళ్లారు. అయితే అది ఒక్కసారిగా రోడ్డుపై పరుగులు తీసింది. వాహనాలను సైతం లెక్క చేయకుండా వాటి మధ్య ఎనుగు పరుగులు పెట్టింది. దాంతో పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm