హైదరాబాద్ : ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఓ కర్ణాటక బీజేపీ మంత్రి మాస్కు ధరించకుండా ఓ వింత వాదన చేస్తున్నారు. మాస్కు ధరించడంపై ఎలాంటి నిర్బంధం లేదని ప్రధాని అన్నారని అంటున్నారు. కర్ణాటకలో ఆహార, పౌరసరఫరాలు, అటవీ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి అయిన ఉమేశ్ కట్టీ తాజాగా మాస్కు ధరించలేదు. దాంతో మాస్కు ఎందుకు ధరించలేదని విలేకరులు ప్రశ్నించగా ఆయన వింత వాదన వినిపించారు.
ఆయన మాట్లాడుతూ.. 'మాస్కు ధరించడం, ధరించకపోవడం అన్నది వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని ప్రధాని చెప్పారు. మాస్కు ధరించడంపై ఎలాంటి నిర్బంధం లేదని అన్నారు. అందుకే నేను మాస్కు ధరించాలనుకోవడంలేదు. ఇక సమస్యేముంది?' అని మంత్రి అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2022 07:36PM