హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,07,904 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,983 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో ఇద్దరు మృతి చెందగా 2,706 మంది కోలుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,206 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 259, రంగారెడ్డి జిల్లాలో 227 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,14,639కు చేరింది. అందులో 6,88,105 మంది ఆరోగ్యవంతులయ్యారు. అలాగే మృతి చెందిన వారి సంఖ్య 4,062కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,472 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇవాళ 2,93,843 మందికి కొవిడ్ టీకా డోసులు ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2022 08:10PM