హైదరాబాద్ : కరోనా విజృంభణ నేపథ్యంలో పలు దేశాలు ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కూడా తమ రాజధాని నగరం అబుదాబిలోకి ప్రవేశించాలంటే కొన్ని ఆంక్షలు విధించింది. బూస్టర్ డోసు తీసుకున్న వారినే అబుదాబిలోకి అనుమతిస్తామని అక్కడి అధికార యంత్రాంగం ప్రకటించింది. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకుంటేనే వ్యాక్సినేషన్ పూర్తయినట్టు పరిగణించనున్నట్టు వెల్లడించింది. అబుదాబిలో ప్రవేశించేవారు తప్పనిసరిగా వారి టీకా స్థితిని తెలియజేసే.. గ్రీన్ పాస్ను చూపించాలని పేర్కొన్నారు. అలాగే గత రెండు వారాల్లో కరోనావైరస్ పరీక్షలో నెగటివ్ వచ్చి ఉండాలని తెలిపింది. ఇక అబుదాబి నివాసితులు పబ్లిక్ స్థలాలు లేదా ప్రభుత్వ భవనాలలోకి ప్రవేశించే ముందు తమ గ్రీన్ పాస్‌ను చూపించవలసి ఉంటుందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm