నవతెలంగాణ కంటేశ్వర్
నేషనల్ హెల్ప్ లైన్ ఫర్ సీనియర్ సిటిజన్ అనే పేరుతో వికలాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14567 వయో వృద్ధులకు, వికలాంగులకు 18005728980 హెల్ప్ లైన్ ని నడుపుతున్నది.ఈ హెల్ప్ లైన్ల ద్వారా నిరాశ్రయులకు ఆదరణ వేధింపులకు గురౌతున్న పెద్దల సంరక్షణ మాన సిక భావోద్వేగాలకు సలహా మరియు సూచనలు, చట్టపరమైన మార్గదర్శకత్వము మరియు వృద్ధాశ్రమాలు / సంరక్షరులు/కాలక్షేప కేంద్రాల గురించిన సమాచారం అందిచే పాంప్లేటును మంగళవారం పోలీస్ కార్యలయం యందు పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు, ఐ.పి.యస్. విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఫీల్డు రెస్పాన్స్ ఆఫీసర్ టి. రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm