హైదరాబాద్ : నకిలీ కాల్‌సెంటర్లతో విదేశీయులను బురిడీ కొట్టించిన సైబర్‌ముఠాను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. మరో రెండు ముఠాల కోసం గాలిస్తున్నారు.ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాలుగేండ్లలో వెయ్యి కోట్ల రూపాయల వరకు మోసం జరిగి ఉండొచ్చని పోలీసుల విచారణలో తేలింది.
అంతర్జాతీయ క్రెడిట్ కార్డు హోల్డర్స్‌ను టార్గెట్‌గా చేసుకొని ముఠా బురుడీ కొట్టించింది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల డేటాను డార్క్ వెబ్ సైట్ , గూగుల్ యాడ్స్ ద్వారా డేటాను ఈ ముఠా సేకరించినట్లు విచారణలో తేలింది. గూగుల్ యాడ్స్‌లో వైరస్ క్లియర్ చేస్తామని యాడ్స్ ఇచ్చి , నిజమేనేమో అని సంప్రదించిన వ్యక్తులను టార్గెట్‌గా చేసుకుంటారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా కొనుగోళ్లు, పేమెంట్లు జరిపే ఖాతాదారులను లక్ష్యంగా చేసుకున్నారు. అంతర్జాతీయంగా ఖాతాదారులు చేసే కొనుగోళ్లు, నగదు చెల్లింపునకు కార్డు నంబరు, సీవీవీ, ఎక్స్‌పైరీ తేదీ ఉంటే సరిపోతుంది. ఇక్కడి మాదిరిగా ఓటీపీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ ముఠా.. 80 మంది టెలీకాలర్స్‌ని నియమించుకుని రెండు టోల్ ఫ్రీ నంబర్ల నుంచి 33 వేల మందిని మోసం చేసినట్టు తెలిసింది.పేమెంట్ గేట్ వేల ద్వారా కాజేసిన సొమ్మును విదేశీ అకౌంట్లుకు జమ చేయడం, ఈ ముఠా వెనుక నాలుగు, ఐదు దేశాలకు చెందిన హవాలా ముఠా హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలక సూత్రధారి నవీన్ భుటాని కనుసన్నల్లోనే వ్యవహారం సాగినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడు బ్యాంకింగ్ రంగంలో పనిచేయటం వల్ల ఆర్థిక లావాదేవీలు, క్రెడిట్‌కార్డులపై మంచి పట్టుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 18 Jan,2022 08:39PM