హైదరాబాద్ : బిహార్లోని కటిహార్ జిల్లాలో నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో ఉన్న శిశువుకు ఓ మహిళ జన్మనిచ్చింది. దాంతో ఆ శిశువును చూసేందుకు జనం భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. హఫ్లగంజ్ గ్రామానికి చెందిన రాజు సాహ్ తన భార్యను ప్రసవం కోసం సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమె ఓ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ నవజాత శిశువుకు నాలుగు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయని తెలుసుకుని వారు షాక్ అయ్యారు. ప్రయివేటు క్లినిక్ వైద్యులు గతంలో స్కానింగ్ తీసినప్పుడు దీని గురించి చెప్పలేదన్నారు. శిశువు ఆరోగ్యం ఉన్నట్లు చెప్పేవారని.. చివరకు వింత శిశువు జన్మించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వింత శిశువు కాదని.. ఈ శిశువును దివ్యాంగులుగా పిలుస్తారని సదర్ ఆస్పత్రి వైద్య సిబ్బంది చెప్పారు. గర్భధారణ సమయంలో కవలలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm