మధుర: కృష్ణుడు సత్యం కోసం పోరాడిన అతి పెద్ద రాజకీయ నాయకుడని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, యూపీ కాంగ్రెస్ విభాగం పరిశీలకులు భూపేష్ బఘెల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయన నుంచే పాఠాలు నేర్చుకుందన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధురలోని శ్రీకృష్ణ మందిరంలో ఆయన మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యం కోసం ఎలా పోరడాలనేది కృష్ణుడిని చూసి నేర్చుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వెలువడనున్నాయని, యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రోజులు ముగియనున్నాయని అన్నారు. ప్రియాంక గాంధీ నాయకత్వంలో రైతులు, శ్రామికులు, మహిళల కోసం పార్టీ పోరాడుతూ మరింత పటిష్టమవుతోందని ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm