న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో వామపక్షాలు పది స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సీపీఐ(ఎం), సిపిఐ పార్టీలు చెరో నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. సిపిఐ(ఎంఎల్) రెండు స్థానాల్లో పోటీ చేయనుంది. కేథర్ నాథ్, థరాలీ, షాహాస్పూర్, రానిపూర్ అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ(ఎం) పోటీ చేయనుండగా, రుద్రప్రయాగ్, గంగోత్రి, నరేంద్ర నగర్, బద్రీనాథ్ అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేయనుంది. కర్ణప్రయాగ్, లాల్కూమ్ అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ (ఎంఎల్) పోటీ చేయనుంది.
Mon Jan 19, 2015 06:51 pm