ముంబై : మహారాష్టల్రోని ముంబైలో డాక్‌యా ర్డ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ రన్వీర్ నౌకలోని అంతర్గత కంపార్ట్‌మెంట్‌లో పేలుడు సంభవించినట్లు సమాచారం. వెంటనే స్పందించిన నౌక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పేలుడు సంభవించడంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. 11 మంది నౌకాదళ సిబ్బందికి తీవ్రగాయాల య్యాయి. క్షతగాత్రులను ముంబై నౌకాదళ ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm