సూర్యాపేట: జిల్లాలోని చింతల పాలెం మండలం అడ్లూరు వద్ద కృష్ణానదిలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం కందుకూరి గోపి(13), కందుకూరి చంద్రశేఖర్(24) చేపల వేటకు వెళ్లి కృష్ణా నదిలో గల్లంతయ్యారు. రెండు రోజులు గడుస్తున్నప్పటికీ వారి ఆచూకీ ఇంకా లభించలేదు. రాత్రి నుండి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మూడో రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm