హైదరాబాద్ : తెలంగాణ గిడ్డంగుల శాఖలో భారీ స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది. గిడ్డంగుల శాఖకు సంబంధించి ఫిక్స్ డ్ డిపాజిట్ నిధులు రూ.4 కోట్ల నిధులు మాయమైనట్టు సమాచారం. కార్వాన్ యూనియన్ బ్యాంక్ నుంచి నిధులు మాయం చేసినట్టు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందింది.
గిడ్డంగుల శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా తెలుగు అకాడమీ కేసు ముఠా పనేనని అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm