హైదరాబాద్ : గాన కోకిల లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. జనవరి 8న ఆమెకు కోవిడ్ పాజిటీవ్ గా నిర్ధారణయింది. అయితే ఆమెకు తేలికపాటీ లక్షణాలున్నప్పటికీ జనవరి 9న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమెను చేర్చారు. ఐసీయూలో ఆమెకు చికిత్సనందిస్తున్నారు. ఆమెను వైద్యులు నిరంతరల పర్యవేక్షిస్తున్నారు. డా. ప్రతీత్ సందానీ తాజాగా మాట్లాడుతూ.. లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు అని తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని తమ ప్రయత్నం తాము చేస్తున్నామన్నారు. త్వరలోనే ఆమె కోలుకుంటారని చెప్పారు. ఆమె కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm