అమరావతి: మచిలీపట్నంలో ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య కలెక్టరేట్ ముట్టడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భానుమూర్తి పాండు రంగ వర ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాండురంగ ప్రసాద్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మచిలీపట్నానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉపాధ్యాయ సంఘాల కలెక్టరేట్ ముట్టడికి ఎన్జీవో జేఏసీ మద్దతిచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm