హైదరాబాద్: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. హయత్‌నగర్ బంజారకాలనీలో సువర్ణ అనే మహిళ తన భర్త వెంకటేష్ వేధించడంతో మనస్తాపానికి గురైంది. వారం రోజుల క్రితం తన ఏడు నెలల బాబుపై శానిటైజేర్ పోసిన సువర్ణ తర్వాత తాను కూడా నిప్పంటిచుకుంది. ఆమె స్వల్ప గాయాలతో బయటపడగా.. బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. తల్లి సువర్ణపై కేసు నమోదైంది.
Mon Jan 19, 2015 06:51 pm