హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలో సెల్ఫీ సూసైడ్ చోటుచేసుకుంది. ఆస్తుల విషయంలో ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలనగర్‌లో తిప్పారపు శ్రీనివాసాచారి(42) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు ఆయన సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆస్తిని తన అన్న ఆంజనేయులు అక్రమంగా ఆయన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని శ్రీనివాసాచారి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తన అక్క లక్ష్మి కూడా మోసం చేసిందని శ్రీనివాసాచారి ఆరోపించాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm