హైదరాబాద్: ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిపై చర్చిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. బీజేపీయేతర పార్టీలు అన్నీ ఏకం కావాలని.. అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రాల హక్కులు కాలరాస్తోన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యరన్నారు. కేసీఆర్ స్టార్టజీ బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చడమే అని.. ఆయన విధానం బీజేపీకి సాయం చేయడమనే అనుమానం కలుగుతోందని అన్నారు. ఈ అంశంపై ఆల్ ఇండియా మహాసభలో చర్చ జరుగుతోందని తెలిపారు. తేజస్వి యాదవ్ కేసీఆర్‌ను కలిసినప్పుడు కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామని చెప్పినట్టు వార్తలు వచ్చాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317జీవో ఆశస్త్రీయంగా ఉందని, ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలన్నారు. మన ఊరు మన బడి పేరుతో 3వేల కోట్ల కాంకర్యం చేసేలా కనిపిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం తప్ప ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. కేవలం 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై ఉగ్రదాడి అనేది పొలిటికల్ స్టాంట్‌లో భాగమే అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 20 Jan,2022 01:51PM