హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం నుంచి ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఆయన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. గతంలో ఫీవర్ సర్వేతో దేశంలోనే ఆదర్శంగా నిలిచామన్నారు. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి మళ్లీ ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు అందుబాటులో మందులు ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వాస్పత్రులకు పూర్తిస్థాయిలో హోం ఐసొలేషన్, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు ఇవ్వనున్నామన్నారు. రాబోయే రోజుల్లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm