అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లాలో రేణిగుంటలో దారుణం చోటుచేసుకుంది. భర్త తలను ఓ భార్య దారుణంగా నరికింది. అనంతరం ఆ తల తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులైను వీధిలో నివాసం ఉండే రవి చంద్రన్ (53) ,వసుంధర భార్యాభర్తలు. వీరికి 20 ఏండ్ల కుమారుడు ఉన్నాడు. గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వసుంధర తన భర్తపై కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి అతని తల నరికేసింది. అనంతరం ఆ తలను సంచిలో తీసుకుని స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. దాంతో పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి హత్య జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm