హైదరాబాద్ : తెలంగాణలో కొవిడ్ ఆంక్షల అమలును రాష్ర్ట ప్రభుత్వం పొడిగించింది. సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో ఆంక్షలు ముగుస్తాయనగా రాష్ర్ట ప్రభ్వుత్వం మరోసారి వాటిని పొడిగించింది. జనం గుమిగూడే అన్ని కార్యక్రమాలపై ఆంక్షలు విధించింది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సర్కారు సూచించింది.
Mon Jan 19, 2015 06:51 pm