ముంబై: నకిలీ సర్టిఫికేట్లు, డిగ్రీ పట్టాలను తయారు చేస్తున్న ముఠాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బోరివలి ప్రాంతంలోని ఒక భవనంపై ఆకస్మికంగా దాడిచేశారు. అక్కడ అనేక యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లు, డిగ్రీపట్టాలు కుప్పలుగా ఉండటాన్ని గుర్తించారు. దాంతో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరచగా వారిని ఈనెల 27 వరకు పోలీసు కస్టడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm