హైదరాబాద్: బోయిన్పల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర, బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల (ఇంగ్గిష్ మీడియం)లో వివిధ సబ్జెక్టుల్లో విద్యా వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలుర పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గణితం, ఫిజిక్స్, బయోసైన్స్, సోషల్, ఎస్జీటీ పోస్టులు(5) ఖాళీగా ఉన్నాయన్నారు. బాలికల పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సోషల్, హిందీ పండిట్ గ్రేడ్-2 పోస్టులు(2) ఖాళీగా ఉన్నాయన్నారు. బాలుర పాఠశాలలో స్ర్తీ, పురుషులు, బాలికల పాఠశాలలో స్ర్తీలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంగ్లిష్ మీడియం వారికి ప్రాధాన్యం ఉంటుందని, మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేపడతామని చెప్పారు. అర్హతగల అభ్యర్థులు ఈనెల 26లోపు తిరుమలగిరి మండలంలోని బోయిన్పల్లి జిల్లా గిరిజనాభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. వివరాలకు 8374909268, 9553554455 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm