అమరావతి: భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉండడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తనను, తన కుమారుడిని రోడ్డున పడేస్తాడేమోనని ఆందోళన చెందింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవ కూడా జరిగింది. అయినప్పటికీ భర్త తీరులో మార్పు లేకపోవడంతో అతడిని పొడిచి చంపింది. ఆపై మొండెం నుంచి తలను వేరు చేసి సంచిలో వేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. సంచలనం సృష్టించిందిన ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన శ్రీభాష్యం రవిచంద్ర సూరి (53).. భార్య వసుంధర, కుమారుడితో కలిసి రేణిగుంటలో ఉంటూ అక్కడి పారిశ్రామికవాడలో రీసైక్లింగ్ పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. సూరి ఇటీవల మరో మహిళతో సన్నిహితంగా ఉండడాన్ని చూసి వసుంధర తట్టుకోలేకపోయింది. కుమారుడితో కలిసి తాను రోడ్డున పడాల్సి వస్తుందేమోనని భయపడింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవ కూడా జరిగింది.అయినప్పటికీ భర్త ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి అతడిని హతమార్చాలని నిర్ణయించుకుంది. సూరి నిన్న ఉదయం ఇంట్లో టిఫిన్ చేస్తున్న సమయంలో వసుంధర కత్తితో పొడిచి చంపేసింది. అనంతరం మొండెం నుంచి తలను వేరు చేసి సంచిలో వేసుకుని కుమారుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. సంచిలోని తలను చూసిన పోలీసులు హడలిపోయారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jan,2022 07:38AM