హైదరాబాద్: దేశంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించిన తర్వాత కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. అయితే, వైరస్‌లో చాలా రకాలు ఉండడంతో సోకింది ఏ రకమో తెలియక జనం అయోమయానికి గురవుతున్నారు. వైద్యులు కూడా నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపితే తప్ప నిర్ధారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో గంటలోపే మనకు సోకింది ఏ రకమో తెలుసుకునేందుకు ఓ టెస్టింగ్ కిట్ అందుబాటులోకి వచ్చింది. చెన్నైకి చెందిన క్రియా మెడికల్ టెక్నాలజీస్ సంస్థ రూపొందించిన ఈ కిట్ పేరు ‘క్రివిడా నోవస్ కొవిడ్-19 టెస్టింగ్ కిట్’. ఇమ్యూజెనిక్స్ బయోసైన్స్ అనే సంస్థతో కలిసి ఈ కిట్‌ను తయారుచేసింది. దీని ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవవచ్చని క్రియా పేర్కొంది. తాము ఏ వేరియంట్ బారినపడ్డామో ఇది కచ్చితంగా ఇది చెప్పేస్తుందని తెలిపింది. క్రియా అభివృద్ధి చేసిన ఈ కిట్‌కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదం కూడా లభించింది. చెన్నైలోని తమ ప్లాంట్‌లో వారానికి 50 లక్షల కిట్లను ఉత్పత్తి చేస్తున్నామని, అవసరాన్ని బట్టి వాటి సంఖ్యను పెంచుతామని క్రియా మెడికల్ టెక్నాలజీస్ పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm