న్యూఢిల్లీ: రిలయన్స్ జియో కు చెందిన జియో ఈస్తోనియా, ఫిన్‌ల్యాండ్ యూనివర్సిటీ ఓలు 6జీ టెక్నాలజీ వి షయంలో సహకారం కోసం ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంతో తమ 5జీ సామర్థ్యాలు మరింత పెరగడంతోపాటు, 6జీకి సంబంధించి వినియోగ అవకాశాల అన్వేషణకు వీలు కలుగుతుందని జియో ప్రకటన విడుదల చేసింది. ‘ప్రపంచంలో తొలి 6జీ పరిశోధన కార్యక్రమాన్ని నడిపిస్తున్న ఓలు యూనివర్సిటీ.. 6జీకి సంబంధించి వైర్‌లెస్ కమ్యూనికేషన్‌పై దృష్టి సారించింది. జియో ఈస్తోనియా, రిలయన్స్ గ్రూపుతో కలసి పరిశోధనకు ఆసక్తిగా ఉన్నాం’ అని ఓలు యనివర్సిటీ 6జీ ఫ్లాగ్‌షిప్ ప్రొఫెసర్ మట్టి లాత్వ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm