హైదరాబాద్: సంక్రాంతికి అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన 'బంగార్రాజు' సినిమా బాక్సీఫీస్ ను షేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. కల్యాణ్ కృష్ణ రూపొందించిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తుండడంతో నాగార్జున తన భార్య అమలతో కలిసి ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm