హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో బొలాండ్ పార్క్ వేదికగా శుక్రవారం జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ వేదికలోనే గత బుధవారం జరిగిన తొలి వన్డేలో 297 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా.. చివరికి 31 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 0-1తో వెనకబడి ఉండగా.. సిరీస్‌పై ఆశలు నిలవాలంటే ఈరోజు మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. తొలి వన్డేలో ఓడినప్పటికీ.. తుది జట్టులో కెప్టెన్ రాహుల్ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టులో ఒక మార్పు జరిగినట్లు కెప్టెన్ తెంబ బవుమా వెల్లడించాడు. ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్‌సెన్ స్థానంలో సిసండా జట్టులోకి వచ్చాడు.
Mon Jan 19, 2015 06:51 pm