యాదాద్రి : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండపైన దుకాణాలు కోల్పోయిన దుకాణదారులు కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. ఈ మేరకు శుక్రవారం కూడా వారు ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో యాదాద్రి పర్యటనకు వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్ను వారు అడ్డుకుని వినతిపత్రం అందజేశారు. యాదాద్రి అభివృద్ధి పనులు పరిశీలించి వెళ్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కొండపైన దుకాణదారులు అడ్డుకున్నారు. తమకు కొండపూనే దుకాణాలు మళ్లీ అక్కడే కేటాయించాలని కోరారు. దీంతో వాహనం నుంచి కిందకు దిగిన మంత్రి.. దుకాణదారుల వినతిపత్రం స్వీకరించారు. వారి సమస్యలను విన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. దాంతో దుకాణదారులు నిరసన విరమించారు.
Mon Jan 19, 2015 06:51 pm