అమరావతి : మైనర్ ను తోటలోకి తీసుకెళ్లి ఆమెపై యువకుడు లైంగికదాడికి పాల్పడిన దారుణ ఘటన ఏపీలోని విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే.. రాజయ్యపేటలో బుధవారం సాయంత్రం స్కూల్ వదిలిన తర్వాత బయటకు వచ్చిన బాలికను అదే గ్రామానికి చెందిన గొడ్డు నాగేష్ (21) అనే యువకుడు గ్రామానికి దూరంగా ఉన్న జీడి తోటలోకి తీసుకువెళ్లాడు. అక్కడ బాలికపై లైంగికదాడి చేశాడు. అనంతరం విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. రాత్రి 9 గంటల సమయంలో బాలికను దూరంగా విడవగా బాలిక ఇంటికొచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారు నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm