హైదరాబాద్ : హైదరాబాద్ ముచ్చింతల్ లో చినజీయర్ ఆశ్రమంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న 216 అడుగుల సమతా మూర్తి విగ్రహాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 5న సామాజిక సంస్కరణలకు ఆద్యుడైన రామనుజచార్యుల 1000వ జయంతి సందర్భంగా ఈ విగ్రాహావిష్కరణ జరగనుంది. అదే నెల 13న సమతా మూర్తిలోపల గర్భాలయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభిస్తారు. ఈ మేరకు చినజీయర్ స్వామి ఆశ్రమం ఓ ప్రకటనను విడుదల చేసింది. సమతా మూర్తి ఆవిష్కరణకు అన్ని వర్గాల వారిని ఆహ్వానిస్తున్నామన్నారు. ముఖ్య అతిథులు, భక్తులు, ప్రజలంతా వచ్చి సమతా మూర్తి ఆవిష్కరణను విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm