నవతెలంగాణ-భిక్కనూర్
శుభ కార్యక్రమానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన శుక్రవారం సాయంత్రం కామారెడ్డి జిల్లాలోని 44వ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా గంగాపూర్ గ్రామానికి చెందిన దేవవ్వ (36), కొడుకు వేణులు కలిసి ద్విచక్ర వాహానం పై దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి శుభకార్యానికి వెళ్తున్నారు. భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామం వద్దకు రాగానే వారి బైక్ ను వెనుక నుండి వస్తున్న లారీ కంటైనర్ ఢీకొట్టింది. దాంతో దేవవ్వ ఒక్కసారిగా కిందపడిపొగా ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది తీవ్రగాయాలైన కొడుకు వేణును కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jan,2022 05:41PM