హైదరాబాద్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. పంత్ (85), రాహుల్ (55) అర్ధసెంచరీలతో రాణించారు. ముందుగా ధావన్ 29 పరుగులు చేసి అవుటవ్వగా విరాట్ కోహ్లీ డకౌటై నిరాశపరిచాడు.ఆ తర్వాత పంత్తో కలిసి రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మూడో వికెట్కు 115 పరుగుల భాగస్వామ్యం జోడించిన అనంతరం ఇద్దరు అవుటయ్యారు. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్ (22), శ్రేయస్ అయ్యర్ (11)లు తక్కువ పరుగులకే వెనుదిరిగారు. చివరలో శార్దూల్ ఠాకూర్ (40 నాటౌట్), అశ్విన్ (25 నాటౌట్) పోరాడడంతో భారత జట్టు భారీ స్కోరు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm