హైదరాబాద్ : విమాన ప్రయాణికుల లగేజీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు ఒకరు ఒకటి కంటే ఎక్కువ హ్యాండ్ బ్యాగ్లను తీసుకురాకుండా చూడాలని ఎయిర్పోర్ట్ అథారిటీలతో పాటు విమానయాన సంస్థలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుకు సంబంధించిన ఆదేశాలను జనవరి 21న సీఐఎస్ఎఫ్ ఐజీ విజయ్ ప్రకాశ్ -డీజీసీఏ సెక్యురిటీ విభాగానికి జారీ చేసారు. విమానాశ్రయాల్లో రద్దీని తగ్గించడం సహా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం దేశీయ విమానాల్లో వెళ్లే ప్రయాణికులు ఒక హ్యాండ్ బ్యాగ్ను మాత్రమే తీసుకు రావాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని ప్రయాణికులకు ముందుగానే ఇవ్వాలని విమానయాన సంస్థలను కేంద్రం ఆదేశించింది. విమానాశ్రయ నిర్వహణ సంస్థలు కూడా చెకింగ్ సమయంలో వన్ హ్యాండ్ బ్యాగ్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jan,2022 06:41PM