ఐజ్వాల్ : మిజోరంలో శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది. చంపారు గ్రామానికి సమీపంలో భూ ప్రకంపనలు వచ్చాయని.. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.6గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. చంపారుకి ఉత్తరాన 58 కిలోమీటర్ల దూరంలో ఇండియా - మయన్మార్ సరిహద్దులో 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అన్నారు. దీని తీవ్రతతో పక్కనే ఉన్న మణిపూర్, అసోం, ఉత్తరబెంగాల్‌లో కూడా స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm