హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టెల కోసం అడవికి వెళ్లిన మహిళలతో స్థానిక అటవీ శాఖ అధికారి అసభ్యంగా ప్రవర్తించాడని, ఓ మహిళ వస్త్రాలు లాగి వివస్త్రను చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన గురువారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముల్కలపల్లి మండలం సాకివాగు అటవీ ప్రాంతంలో
గుత్తికోయ గూడెంకు చెందిన నలుగురు మహిళలు గురువారం మధ్యాహ్నం కట్టెల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడ విధులు నిర్వర్తిస్తోన్న ఫారెస్ట్ బీట్ అధికారి వారిని అడ్డుకున్నాడు. అడవిలోకి ఎందుకు వచ్చారంటూ మహిళలను తరిమాడు. ఆ సమయంలో తమపై అసభ్యంగా ప్రవర్తించాడని మహిళలు ఆరోపిస్తున్నారు. ముందుగా ఒకరిపై చేయి చేసుకోగా మరో ముగ్గురు పారిపాయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అధికారి.. ఓ మహిళ వస్త్రాలు లాగగా ఆమె బట్టలు ఊడిపోయాయి. అలాగే మరోమహిళ గోతిలో పడిపోయింది. తర్వాత నలుగురు ఎలాగోలా తప్పించుకున్న అక్కడి నుంచి పారిపోయి వచ్చారు.
ఈ ఘటనను సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఖండించారు.ఆదివాసీ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పలు ప్రజా సంఘాల నాయకులు ఈ ఘటనపై ఖండిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jan,2022 09:16PM