హైదరాబాద్ : హైదరాబాద్ లోని పాత బస్తీలో నకిలీ ఆర్టీపీసీఆర్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లు కలకలం రేగింది. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న రెండు వేర్వేరు ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ముఠా ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులకు నకిలీ సర్టిఫికెట్లు సరఫరా చేస్తోంది. అలాగే దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తోంది. త్వరలో నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
సౌత్ జోన్ డీసీపీ చక్రవర్తి మాట్లాడుతూ.. నిందితుడు లక్ష్మణ్ నుంచి నకిలీ ఆర్టీపీసీఆర్ రిపోర్టులు 65, శాంపిల్ కలెక్షన్ కిట్లు 20, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో నిందితుడు తారిఖ్ హబీబ్ నుంచి 50 నకిలీ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు సీజ్ చేశామన్నారు. నకిలీ ఆర్టీపీసీఆర్ కోవిడ్ 19 రిపోర్ట్స్ 10, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jan,2022 09:26PM