షిల్లాంగ్: ఇటీవల పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా కూడా కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వారు ట్విట్టర్ లో తెలిపారు. ప్రస్తుతం తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, తాను ఐసొలేషన్‌లో ఉన్నానని చెప్పారు. ఇటీవల కాలంలో తనను కలుసుకున్న వారు తమకు ఎలాంటి లక్షణాలు కనిపించినా వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 2020లో కూడా సంగ్మా కరోనా బారిన పడ్డారు.
ప్రస్తుతం మేఘాలయలో 1,782 యాక్టివ్ కోవిడ్-19 కేసులున్నాయి. అలాగే గత 24 గంటల్లో ఈ మహమ్మారి కారణంగా ఒకరు మరణించారు. రాష్ట్రంలో నిన్నటి నుండి 331 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jan,2022 09:33PM